ప్రజల ఓట్లతో గెలిచారు.. తర్వాత గ్రామాల అభివృద్ధికి చేసింది శూన్యం

by Dishanational4 |
ప్రజల ఓట్లతో గెలిచారు.. తర్వాత గ్రామాల అభివృద్ధికి చేసింది శూన్యం
X

దిశ, ధరూర్: జిల్లాలో గ్రామ పంచాయతీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని నడిగడ్డ హక్కుల పోరాట పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ ఆరోపించారు. పల్లెనిద్రలో‌ భాగంగా ఆదివారం రాత్రి ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామంలో బస చేశారు. అనంతరం సోమవారం ఉదయం గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై పారుతోందని,‌ తదితర సమస్యలను గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి పేరుతో ఓట్లు దండుకుని గెలిచిన తర్వాత పాలకులు గ్రామాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేస్తాలేరని విమర్శించారు. గ్రామాల్లో తాగునీటి, పారిశుధ్యం, తదితర సమస్యలు చెత్తకుప్పల పేరుకుపోయాయి, పాలకులు అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లవన్న, నాయకులు రంగస్వామి, ధరూర్ మండల అధ్యక్షుడు గోవిందు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed