- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
దిశ, జడ్చర్ల / మిడ్జిల్ : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అమలుపరచిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో జడ్చర్ల మిడ్జిల్ మండలాల్లో శనివారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముందుగా జడ్చర్ల మండలం పరిధిలోని గంగాపూర్ గ్రామ పని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు 12 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నెలకొల్పిన మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ చేపట్టారు.
అనంతరం రాజపూర్ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి బైరంపల్లి దోనూర్ వాడియాలా మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలకు మసిగండ్లపల్లి గ్రామాల్లో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేపట్టారు దీంతోపాటు మేడ్చల్ నుండి కొత్తపల్లి వరకు 25 కోట్లతో నిర్మిస్తున్న డబ్బుల్ లైన్ రోడ్డు పనులకు చిల్వేర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేపట్టారు అనంతరం బోయినపల్లి గ్రామంలో మూడు కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న 11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజలకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని గడిచిన ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల ముందుకెళుతుందన్నారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లకు పెద్దపీట వేసిందని అన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రతి గ్రామానికి ప్రతి వాడకు సిసి రోడ్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులు సర్వే గంగా కొనసాగుతున్నాయని అందుకు ఉదాహరణ నేడు మండలం లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమే అని అన్నారు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నానని నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారని కానీ ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే తనకు పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని ఆ పరిసరాల ప్రాంత రైతులు ఆక్రమిస్తే తరలింపునకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లను తగలబెట్టాలని వారిపై కేసులు కాకుండా తాను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి తాను పాటుపడి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం అసత్యపు ప్రచారాలు చేస్తూ పబ్బం కడుక్కునే పనిలో పడ్డారని ఎవరు ఎన్ని అన్న నియోజకవర్గ అభివృద్ధి తన అభిమాని అన్న పట్టించుకోనని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం జి రబ్బాని మిడ్జిల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి నాయకులు ఎండీ గౌస్ సాయిలు బి వెంకటయ్య ఎం బాల్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి జహంగీర్ ప్రశాంత్ రెడ్డి సత్యం గుప్తా రామ్ గౌడ్ పర్వతాలు ఉస్మాన్ బుర్ర రవి రమేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.