మక్తల్ లో మంత్రి పర్యటనకు 250 మంది సిబ్బందితో బందోబస్తు – డీఎస్పీ వెంకటేశ్వరరావు

by Disha Web Desk 11 |
మక్తల్ లో మంత్రి పర్యటనకు 250 మంది సిబ్బందితో బందోబస్తు – డీఎస్పీ వెంకటేశ్వరరావు
X

దిశ మక్తల్ : మక్తల్ లో బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ కేంద్రాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు ఓకే వేదికమీద చేసెందుకు వస్తున్న మంత్రి కి గట్టి బందోబస్తు ఉంటుందని, సమావేశ స్థలంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.విధులు నిర్వర్తించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విఐపి బందోబస్తులో కేటాయించిన స్థలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విఐపి ప్రోగ్రాం ముగిసే వరకు జాగ్రత్తలు పాటిస్తూ సమస్యలుంటె పై అధికారులకు తెలపాలన్నారు.మంత్రి పర్యటన బందోబస్తుకు ఉమ్మడి గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి 250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Next Story