ఆర్ఎస్ ప్రవీణ్​పై ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసన

by Disha Web Desk 15 |
ఆర్ఎస్ ప్రవీణ్​పై ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసన
X

దిశ, అచ్చంపేట : బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కొయ్యల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న, అచ్చంపేట ఇంచార్జ్ కొయ్యల శ్రీనివాసులు మాట్లాడుతూ బీఎస్పీ అధినేత్రి మాయావతి, పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచితల వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చితే ఏమవుతుందని అవమానకరంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రూ.200 కోట్లు తీసుకువచ్చానని మాయమాటలు చెబుతూ గ్రామాలలో వాలు పోస్టర్లు వేయించుకున్నాడని, ఆ నిధులు ఏమయ్యాయి అని, కోట్లకు ఫామ్ హౌస్ లో అమ్ముడుపోయింది నీవు కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అతి ఉత్సాహం చేసి ఘర్షణ వాతావరణ ఏర్పడేలా చేశారని వారు ఆరోపించారు. దీంతో బీఎస్పీ నాయకులకు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐకి బీఎస్పీ నాయకుల మధ్యన ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న చొక్కా చిరిగిపోయింది. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుండి బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.


Next Story