- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోస్టల్ బీమా పథకం పేదలకు వరం
by Sumithra |

X
దిశ, పెద్ద కొత్తపల్లి : మండల పరిధిలోని బీజేపీ పెద్ద కార్పాముల గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకం పోస్టల్ ప్రమాద బీమా పథకాన్ని బీజేపీ 23 బూత్ లో బూత్ అధ్యక్షులు గజ్జి సురేష్, ప్రధాన కార్యదర్శి పెద్దురి శంకర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ నుంచి సంభవిస్తుందో ఎవరికి తెలియదని, కాబట్టి కుటుంబానికి రక్షణగా ఈ పథకాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. కేవలం 755 రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి చెల్లించిన రూ.15 లక్షల వరకు బీమా లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాగర్ కర్నూల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకల శివ, బూత్ మాన్ కి బాత్ ప్రముఖ్ గజ్జి రమేష్, బూత్ అధ్యక్షులు ముచ్చు కృష్ణ, మల్లేష్, మధు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Next Story