- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కోళ్ల పందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
దిశ, బిజినపల్లి : పందెం కోళ్ల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఆదివారం బిజినపల్లి మండలంలోని మంగనూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సుమారు 30 మంది కోళ్ల పందాలు ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు సీఐ కనకయ్య ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి ఈ మెరుపు దాడులు నిర్వహించామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ....ఈ టీంలో బిజినపల్లి ఎస్సై నాగ శేఖర్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్సై నాగేందర్ రెడ్డి, 20 మంది కానిస్టేబుల్ తోని దాడులు నిర్వహించామన్నారు. ఈ 30 మందిలో పది మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 20 మందిని విచారణ చేసి త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. పదిమంది నుంచి 14 బైకులు, 4 పందెం కోళ్ళు, 8 మొబైల్ ఫోన్స్, 13 వేల నగదు, స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. చేగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ కోడిపందెం ఆర్గనైజ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పేకాట,కోళ్ల పందెం ఆడుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ప్రజలకు సూచించారు.