గ్రామాలలో భారీగా మోహరించిన పోలీసులు

by Dishanational1 |
గ్రామాలలో భారీగా మోహరించిన పోలీసులు
X

దిశ, గద్వాల ప్రతినిధి: గట్టు మండలం చిన్నినిపల్లి, బోయాల గూడెం, ఇందువాసీ గ్రామాల ప్రజలు అర్ధరాత్రి బిక్కు బిక్కు మంటూ నిద్ర లేకుండా గడిపారు. ఏ క్షణాన పోలీసులు గ్రామాలకు వచ్చి అరెస్ట్ చేస్తారో అని రాత్రి మొత్తమంతా గ్రామస్తులు భయంగా గడిపారు. సుమారు 2000కు పైగా ఎకరాలు చీన్నోనిపల్లి రిజర్వాయరులో భూమిని కోల్పోయి జీవనోపాధి లేక రైతులూ తమ భూములు తమకు ఇప్పించండి అంటూ నిరసన చేపట్టారు. రిజర్వాయర్ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదంటూ 421 రోజులూ ముంపునకు గురైన భూముల్లో గ్రామస్తులు, రైతులు టెంట్ వేసుకుని దీక్షకు గ్రామస్తులు, రైతులు పూనుకున్నారు. అకార యంత్రాంగాన్ని రిజర్వాయర్ ను రద్దు చేయాలని అధికార యంత్రాంగాన్ని వేడుకొన్నారు.

90 శాతం పూర్తి అయిన రిజర్వాయర్ పనులకు ఆటంకం కలిగించకుండా రిజర్వాయర్ పనులు చేసేందుకు సహకరించండి అంటూ అధికార యంత్రాంగం భూ నిర్వాసితులతో చర్చించింది. ఎలాగైనా రిజర్వాయరు పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పోలీసుల సహకారం తీసుకుని పనులు చేపట్టేందుకు ఉపక్రమించింది. నిన్న అర్ధరాత్రి గ్రామాలలో ఉన్న రైతులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాలలో తరలించారు. సుమారు 300 మందికి పైగా పోలీసులు బారీకెడ్ లు గ్రామాల్లో ఏర్పాటు చేసి గ్రామాలలోకి ఎవరూ రాకుండా మోహరించారు. ఆదివారం ఉదయం గ్రామాలలో పోలీస్ వాహనాలు తిరుగుతూ అనుమానం ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకొంది.

చిన్నోనిపల్లి భూ నిర్వాసితులకు అండగా పలు పార్టీలు మద్దతు ఇవ్వటమే కాక వారి ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచాయి. పలు పార్టీల నేతలు భూ నిర్వాసితులకు అండగా ఉండేందుకు వారిని కలవడానికి ఉపక్రమించాయి. ఈ పోరాటానికి రాజకీయ రంగు పులమాడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని పోలీసులు భారీగా మోహరించారు.

Read Disha E-paper

Next Story

Most Viewed