అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, మక్తల్: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కృష్ణ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కున్సి గ్రామానికి చెందిన పల్లె కిష్టప్ప శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన కుండ మారెప్పనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగిన మైకంలో గొడవ పడ్డారని, చనిపోయాక శుక్రవారం అర్దరాత్రి ఇంటి ముందున్న మంచంపై పడేసి వెళ్ళిపోయారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed