- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్ల పనితీరు నిరంతరం పర్యవేక్షించాలి : ఎస్పీ జానకి
పోలీస్ స్టేషన్ పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పోలీస్ స్టేషన్ పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణ, నేర నియంత్రణ చర్యలు, పోలీసు స్టేషన్ల పరిపాలనా వ్యవహారాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ పరిధిలోని మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ, నవాబుపేట, కోయిలకొండ, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లలో నిర్వహించబడుతున్న రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, వారెంట్ల అమలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ పై క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తన అధికార పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, కేసుల దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని, గ్రేవ్, సెన్సిటివ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా స్పందించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణకు గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పెండింగ్ వారెంట్ల అమలును వేగవంతం చేయడం, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టడం, సీసీటీవీ నిఘా వ్యవస్థ విస్తరణకు కృషి చేయడం, రోడ్డు భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం, అలాగే పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణను శాఖా నిబంధనలకు అనుగుణంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గాంధీ నాయక్, సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






