- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
'బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం'

దిశ, మహబూబ్ నగర్: సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయమే చేశారని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం ఆరోపించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను తగులబెట్టి మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని.. తమ రాష్ట్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంటే పెడచెవిన పెట్టి 19.093 కోట్లు(6.57శాతం) మాత్రమే కేటాయించి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
కేటాయించిన బడ్జెట్ ఉద్యోగుల జీతభత్యాలకు తప్ప పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువులకు దూరం చేస్తుందని ఆవేదన చెందారు. విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్‌ను సవరించి 30 శాతం నిధులు కేటాయించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహయ కార్యదర్శి సంజీవ్, అరవింద్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.