విలేకరులపై దాడులు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి..

by Disha Web |
విలేకరులపై దాడులు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి..
X

దిశ, మద్దూరు: విలేకరులపై దాడి చేసిన వారిపై విచారణ లేకుండా దోషులుగా గుర్తించి పీడీ యాక్ట్ నమోదు చేయాలని మద్దూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సి. వెంకటయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల నవ తెలంగాణ జర్నలిస్టు యాదగిరిపై అక్కడి మున్సిపల్ చైర్మన్ భర్త అతని అనుచరులు జర్నలిస్టు ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. గురువారం నాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరూ కలిసి తాసిల్దార్ రవికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వౌమ్యంలో పాలకులు ప్రజలకు ముఖ్యమైన వ్యక్తి జర్నలిస్టు అని అలాంటి విలేకరులపై దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

జర్నలిస్టు పైన దాడి చేసిన వారు ఏ పార్టీ అయినా ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మోత్కూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వార్తా కథనం ప్రచురించడంలో తప్పేముందని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన మున్సిపల్ చైర్మన్ భర్తపై అతని అనుచరులపై వెంటనే పీడీ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మన్నె బస్వరాజ యాదవ్, అంజయ్య, వేణుగోపాల్, విజయ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్, సాయిలు, విజయకుమార్, అంజయ్య, షఫీ, పవన్ కుమార్ రెడ్డి, సంతోష్ నాయక్ మధు, మహమ్మద్ నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story

Most Viewed