A గ్రేడ్‌లో పాస్.. ప్రాణం తిరిగొచ్చేనా.. ఫలితాలు రాకముందే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by Disha Web Desk 9 |
A గ్రేడ్‌లో పాస్.. ప్రాణం తిరిగొచ్చేనా.. ఫలితాలు రాకముందే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్‌లో విఫలమయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు రిలీజ్ కాగా, ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తిడతారన్న భయంతో ఓ విద్యార్థి ఇంట్లో నుంచి పారిపోగా.. మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తరచూ ఇలాంటి చాలా ఘటనలే చూస్తున్నాం. అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ అనే విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 10వ తేదీన జరిగింది.

కాగా.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 892/1000 మార్కులతో A గ్రేడ్ సంపాదించుకున్నాడు. ‘‘ ఇన్ని మార్కులు వచ్చాయ్ కొడుకా.. నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు’’ అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

ఫెయిలైన స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినా ఇలాంటి ఘటనలకు ముగింపు పలకడం లేదు. చనిపోవడం పరిష్కారం కాదు. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి.

Next Story

Most Viewed