- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల పెత్తనం..

దిశ,అమరచింత: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది.ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులను పక్కకు నెట్టి,నేతలు ప్రారంభోత్సవాలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. వనపర్తి జిల్లా,అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అధికార పార్టీకి చెందిన పట్టణ, గ్రామ,మండల,స్థాయి నాయకులు, నేతలు,ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను ఎవరికి వారు పోటీ పడీ ప్రారంభించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు,ప్రజలు మండిపడుతున్నారు.
సీసీ రోడ్డు,డ్రైనేజీ,ప్రభుత్వ భవనాలు,సన్న బియ్యం పంపిణీ,వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం లాంటి అనేక కార్యక్రమాలు అధికార పార్టీ నాయకులు ప్రారంభించడం,అధికారులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు,అధికారుల చేతుల మీదుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ,అదేవిదంగా ప్రారంభోత్సవాలు జరగాల్సింది,కానీ ఈ రెండు మండలాల్లో అధికారులను,ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి,అధికార పార్టీ నాయకులు హల్ చల్ చేయడం పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,ఇలాంటి అనధికారిక వ్యక్తులు, అధికారిక కార్యక్రమంలో పెత్తనం చేయకుండా,ఆయా శాఖల గ్రామ,మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారిచేయాలని ప్రజలు కోరుతున్నారు.