- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కనుల పండువగా ఊర్కొండ అంజన్న రథోత్సవం.. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు

దిశ, జడ్చర్ల / ఊర్కొండ: అశేష జనవాహిని నడుమ అభయాంజనేయుడి రథోత్సవం కనుల పండువగా సాగింది. భక్తుల పరవశంతో అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు, ఊర్కొండపేట పుర వీధులు మారు మోగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామ శివారులో వెలసిన అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అభయుడి రథోత్సవం సందర్భంగా భక్తులు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ప్రకాశం, గుంటూరు, కర్నూల్ జిల్లాల నుంచి భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. జైశ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రథం ముందుకు సాగింది.
ముందుగా స్వామి వారికి పంచ సూక్తములతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల నడుమ తీసుకు వచ్చి పూలతో అలంకరించిన రథంలో ఆశీనులు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ శాంతా కుమారి ఎంపీపీ బక్క రాధా జంగయ్య సర్పంచ్ అనిత, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యురాలు మట్ట కలమ్మ, కర్నాటి శ్రీనివాస్‌గౌడ్, రాచకొండ గోపి, రమేష్‌గౌడ్ తదితరులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరుకొండ పేట భక్తులు రథోత్సవాన్ని పోటీపడి జైశ్రీరామ్ జై హనుమాన్ నామ స్మరణతో లాగారు.
ఈ రథోత్సవానికి తిలకించడానికి వేలాదిగా వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి భక్తి పారవశంలో మమేకమయ్యారు. రథోత్సవం ముందు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్ భజనలు చేస్తూ ఆడి పాడారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి యువతతో కలిసి చిందులేస్తూ యువతను ఉత్సాహపరిచారు. అనంతరం ఉత్సాహ విగ్రహాలను ఎమ్మెల్యేలు వేద పండితులతో కలిసి ఆలయంలోకి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేలను జడ్పీ చైర్పర్సన్ ను వేద మంత్రోచ్చారణాలతో ఆశీర్వదించి ఆలయ సాంప్రదాయ ప్రకారం శాలువాలతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
అనంతరం ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాలు భాగంగా వెలసిన పలు మిఠాయి కొట్టులను కలియ తిరుగుతూ తిలకించారు. రథోత్సవం సందర్భంగా కల్వకుర్తి డీఎస్పీ , కల్వకుర్తి, వెల్దండ సీఐలు ఊర్కొండ, కల్వ కుర్తి, వెల్దండ ఎస్సైలు పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్మురాజయ్య, సర్పంచులు అనిల్‌రెడ్డి, ఆంజనేయులు, సుదర్శన్, ని రంజన్‌గౌడ్, ఎంపీటీసీలు గోపాల్ గుప్త, లావణ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనా ర్దన్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి గోపాల్‌రెడ్డి, గిరి నాయక్, పాండు యాదవ్ సుధా బాల్రెడ్డి జంగి రెడ్డి వెంకటరెడ్డి నారాయణరెడ్డి బక్క జంగయ్య, రమేష్, ర వీందర్, రమేష్‌నాయక్, నాగోజీ, ప్ర భాకర్, కృష్ణగౌడ్, మల్లేష్‌గౌడ్, శంకర్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్, చంద్రకాంత్, రామాంజనేయులుగౌడ్ అర్చకులు దత్తాత్రే య శర్మ, శ్రీనివాసశర్మ, ప్రవీణ్‌శర్మ, మహేష్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.