ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి : మంత్రి జూపల్లి

by Aamani |
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి : మంత్రి జూపల్లి
X

దిశ,కొల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ మండలం పరిధిలోని సింగోటం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్ క్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండాలని ఉపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 కోట్లు ఉండగా రూ.8 కోట్లు రూపాయలు విద్య కే కేటాయిస్తామన్నారు. అదేవిధంగా మొదటి విడతగా రత్నగిరి ఫౌండేషన్ ద్వారా పెద్ద దగడ , పెద్ద మారు, కొండూరు, సింగోటం గ్రామాలను ఎన్నిక చేశామన్నారు. విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం టిఫిన్ తో అన్ని సౌకర్యాలు స్కూల్లోనే కల్పిస్తామన్నారు. విడుదల వారీగా అన్ని స్కూళ్లను డెవలప్ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో గోవింద రాజు, ఎంఈఓ చంద్రుడు, హై స్కూల్ హెడ్మాస్టర్ డి వెంకట్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, అంగన్వాడీ టీచర్లు, హై స్కూల్ ఉపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, సింగోటం మాజీ సర్పంచ్ వెంకట్ స్వామి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed