అచ్చంపేట కాంగ్రెస్ విజయ భేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం : వంశీకృష్ణ

by Disha Web Desk 11 |
అచ్చంపేట కాంగ్రెస్ విజయ భేరి భారీ బహిరంగ  సభను విజయవంతం చేద్దాం : వంశీకృష్ణ
X

దిశ, అచ్చంపేట : రేపు అనగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. సోమవారం స్థానిక అభ్యర్థి వంశీకృష్ణ తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వంశీకృష్ణ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నల్లమల నలుమూలల నుంచి లక్షలాది మంది సభకు హాజరు అయ్యేందుకు వంశీకృష్ణ అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల అచ్చంపేటలో సీఎం కేసీఆర్ హాజరైన సభలో ప్రజల నుంచి స్పందన ప్రతిస్పందన కరువైందన్నారు. సీఎం మాటలు అరిగిపోయిన రికార్డు మాదిరిగా. ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.

ఈ రాష్ట్రంలో గడిచిన 10 ఇండ్లలో అధికార పార్టీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలం చెందాయన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిందని ఎస్టీ రిజర్వేషన్ అలాగే మైనారిటీ రిజర్వేషన్లు పెంచుతామని మాయమాటలు చెప్పిందని రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా పూర్తిగా పోలీసు పరిపాలన కొనసాగిందన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రశ్నించే గొంతు అణిచివేయడం అరెస్టులు చేసి జైలుకు పంపడం లాంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిందన్నారు. జర్నలిస్టులను ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 80 నుంచి 95 సీట్లు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని ప్రధానంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అవుతుండడం ఈ ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందన్నారు.

సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి !

డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మల్లు రవి జోష్యం చెబుతూ.. డిసెంబర్ 9న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలకు ఆ రోజే సీఎం హోదాలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అధికారం మనదేనన్నారు.

ధర్మరాజు, యమధర్మరాజు కు మధ్య యుద్ధం..

ఈ సందర్భంగా అచ్చంపేట అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014, 18 లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని విమర్శిస్తూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని అచ్చంపేటలో జరిగే ఎన్నికల యుద్ధం యమధర్మరాజు, ధర్మరాజుకు మధ్య జరగనుందని ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో తో పాటు అచ్చంపేట మేనిఫెస్టో కూడా పీసీసీ రేవంత్ రెడ్డి రేపటి కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించనున్నారని తెలిపారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భవాని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత ల ఆస్తులు మూడింతలు పెరిగాయి తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదని ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు లాయర్ రాజేందర్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story