నూతన రూట్లలో అరుణాచలానికి ఆర్టీసీ బస్సులు -ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి

by Disha Web Desk 11 |
నూతన రూట్లలో అరుణాచలానికి ఆర్టీసీ బస్సులు -ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి
X

దిశ,మహబూబ్ నగర్: భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా ఈనెల 28న అరుణాచలం లో జరిగే గిరి ప్రదక్షిణ కు మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుండి నూతన రూట్లలో బస్సులను నడపనున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు.మంగళవారం ఆమె తన ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు.ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ నుండి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు మరురోజు ఉదయం ఏపీ లోని శ్రీకాళహస్తి చేరుకుని అక్కడ దర్శనానంతరం,తమిళనాడులోని 'తిరుత్తని' గుడిలో సుభ్రమణ్య స్వామి దర్శనం తర్వాత,మధ్యాహ్నం కాంచిపురం చేరుకొని కంచి కామాక్షి అమ్మవారి దర్శనానంతరం 28 రాత్రికి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని ఆమె వివరించారు.

29 వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 30 ఉదయం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటుందని టూర్ ప్యాకేజీ ధర చౌకగా ఒక్కొక్కరికి రాను పోను అన్ని చార్జీలు కలుపుకొని 3700 రూపాయలుగా,పిల్లలకు 1900 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.ముందస్తుగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను బుక్ చేసుకోవచ్చని,తదితర వివరాలకు ఫోన్ నెంబర్లు 9441162588,7382827102,9985320529 లకు సంప్రదించగలరని ఆర్ఎం విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed