తెలంగాణ పోలీస్ శాఖ కు జాతీయ స్థాయిలో గుర్తింపు - డీజీపీ అంజనీ కుమార్

by Kalyani |
తెలంగాణ పోలీస్ శాఖ కు జాతీయ స్థాయిలో గుర్తింపు - డీజీపీ అంజనీ కుమార్
X

దిశ,మహబూబ్ నగర్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని,ఈ ఘనత పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరిదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంత భద్రతల పరిరక్షణ,నేరాల అదుపుపై నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ జిల్లాలో నేరాల అదుపుకై చేపట్టిన చర్యలను వివరిస్తూ,నేరస్తులకు తగిన శిక్షలను పడేందుకు దర్యాప్తులో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు,నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఆవశ్యకత,సైబర్ మోసాలకు 1930 కు ఫోన్ చేయాలని,నిషేధిత మత్తు పదార్థాలతో జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడం,జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వేగ నియంత్రికల ఏర్పాటు,పోలీస్ స్టేషన్ ఆధునీకరణ లాంటి అనేక చర్యలను చేపట్టినట్లు ఎస్పీ విరించారు.ఈ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ లు రాములు,సురేష్ కుమార్,డిఎస్పీలు మహేష్,రమణారెడ్డి,శ్రీనివాసులు,సుదర్శన్ రెడ్డి,సీసీ రాంరెడ్డి,సిఐ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed