తెలంగాణలోని మంత్రులంతా దద్దమ్మలే : నాగం జనార్దన్ రెడ్డి

by Dishanational2 |
తెలంగాణలోని మంత్రులంతా దద్దమ్మలే : నాగం జనార్దన్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ : శ్రీశైలం ఎడమ గట్టు కాల్వన ఉన్న విద్యుత్ కేంద్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలోని నీటిని అక్రమంగా వాడుకుంటుందని దాన్ని నిల్వదించకపోతే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి చేరి దాని ఆధారంగా ఉన్న ప్రాంతాలన్నీ తాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులంతా దద్దమ్మలుగా చేతగానితనంతో ఉన్నారని ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ నీటిని అడ్డగోలుగా వాడుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం శ్రీశైలం 55 టీఎంసీలతో నిల్వ ఉన్నదని 30 టీఎంసీలు పూర్తిగా డెడ్ స్టోరేజ్ గా పరిగణిస్తారని మిగిలిన 25 టీఎంసీలు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఆంధ్ర ప్రభుత్వం విద్యుత్ కేంద్రానికి అక్రమంగా వాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దేశంలోని ఆదాని కంపెనీలపై పార్లమెంటులో ప్రశ్నించినందుకు భారత ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎన్నో సాగు తాగునీటి ప్రాజెక్టులు సీలింగ్ యాక్ట్ గ్రామీణ ఉపాధి హామీ బ్యాంకుల జాతీయ తోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చిన సంగతి గుర్తుతెరగాలన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పెళ్లిళ్ల పేరయ్యగా మారిపోయాడని కేవలం గులాబీ పార్టీ కార్యకర్తల కుటుంబానికే పెళ్లిళ్లు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి పెళ్లిళ్లు తన హయాంలో కూడా ఎంతో మందికి చేశామని కానీ స్వంత కర్చులతోనే జరిపించామన్నారు. తాను వైద్యరంగంలో ఉంటూ చేసిన సేవలతో పోలిస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేస్తున్న సేవలు గోటితో సమానమన్నారు. ప్రస్తుతం జరుపుతున్న సామూహిక వివాహాలకు పట్టణంలోని ప్రజలను, వ్యాపారవేత్తలను పెళ్లిళ్లకు హాజరుకావాలని బలవంతం చేస్తూ హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. తన ట్రస్టు ద్వారా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తున్నామని చెప్తున్న రాష్ట్రాల నుండి దేశాల నుండి ఎన్నో విరాళాలు పెళ్లిళ్ల పేరు మీద పొందుతున్నారని ఆరోపించారు. ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం సరికాదని హెచ్చరించారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని బయటపెడతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed