- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపాలిటీ నిర్లక్ష్యం.. రిటైర్డ్ సీఐ యాక్షన్
ట్యాంక్ బండ్ చెరువు కట్టపై ముళ్ల కంచె పెరగడంతో పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

దిశ, మక్తల్ : ట్యాంక్ బండ్ చెరువు కట్టపై ముళ్ల కంచె పెరగడంతో పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో ఈ ఇబ్బందులను చూసిన ఓ రిటైర్డ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తన అనుచరులతో కలిసి గొడ్డలి చేతబట్టి ముళ్ల కంచెను తొలగించారు. మున్సిపాలిటీ తీసుకోవాల్సిన యాక్షన్ ను నిర్లక్ష్యం చేయడంతో స్వయంగా రిటైర్డ్ సీఐ యాక్సన్ తీసుకొని తొలగించారు. వాస్తవానికి ఆ చెరువు కట్టపై గృహిణీలు, మహిళలు, యువతి, యువకులు వాకింగ్ కి వెళ్తుంటారు. మక్తల్ పట్టణంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఆకతాయిలు, పోకిరీ యువకులు ఈ చెరువు కట్టపై తిరుగుతుంటారు. దాదాపు కిలోమీటర్ పొడవు ఉండే ట్యాంక్ బండ్ చెరువు కట్టకు ఇరువైపులా చెట్లను పెంచి వాటిని సంరక్షించి సందర్శకులకు ఆకర్షణీయంగా కనిపించేలా మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని ఉంది. చెరువుకట్టపై పెరిగిన ముళ్ళ కంచెను తొలగించా లని పాలక మండలికి కమిషనర్ దృష్టికి తాను తీసుకెళ్ళి నెల రోజులు కావస్తున్నా ముళ్లకంచేను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని.. ముళ్ళ తొలగించే విషయంలో పలుమార్లు పాలకమండలి అధికారులను ప్రశ్నించిన పని జరగకపోవడంతో తనే స్వయంగా తన మిత్రుడు దాసరి సూరి, మరో ఇద్దరితో రోజు కొంత ముళ్ళ కంచెను తొలగిస్తున్నానని రిటైర్డ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.
సుందరీకరణలో భాగంగా చెరువు కట్టపై చెట్లు పెంచి సంరక్షించాల్సిన మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్ల నాటిన చెట్లు ఎక్కడ కనిపించడం లేదని.. కానీ ముళ్ళ కంచె పెరిగి పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మున్సిపాలిటీలో పచ్చదనం, పరిశుభ్రత కోసం చెట్లను పెంచి సంరక్షించేందుకు ఓ వ్యక్తిని దినసరి కూలిగా నియమించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా చూపించారు. నాటిన చెట్లు వాస్తవంగా ఎక్కడ కనిపించడం లేదు. చేయని పనికి నిధులను చూపిస్తున్న ఖర్చు చేసామని.. డ్రా చేసుకున్న పాలకమండలి పుర కమిషనర్ పై తీసుకోవాలని మక్తల్ పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం పట్టణ ప్రజలు విశ్రాంతి తీసుకునే ట్యాంక్ బండ్ చెరువు కట్టపై తిరిగేందుకు వీలుగా పచ్చని చెట్లు పెంచి ముళ్లకంచెను తొలగించాల్సిన బాధ్యతను విస్మరిస్తే.. గుర్తు చేసేందుకు తామంత కలిసి నిరసన తెలిపేందుకు వెనకాడమని రిటైర్డ్ సీఐతో పాటు పలువురు ప్రజలు హెచ్చరించారు.






