ఫంక్షన్ కు వచ్చి తల్లి, కూతురు అదృశ్యం

by Nallavelli.Anjaneyulu |

బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

ఫంక్షన్ కు వచ్చి తల్లి, కూతురు అదృశ్యం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఐజలో నివాసం ఉంటుంది. వీరి కుమార్తె మాధురినీ ధరూర్ మండలానికి చెందిన యుగంధర్ కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె కూడా ఉంది. వీరు గత కొంతకాలంగా జడ్చర్లలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మల్దకల్ లో జరిగిన ఓ శారి ఫంక్షన్ కు తన కూతురుతో కలిసి వచ్చింది. ఫంక్షన్ ముగించుకొని మల్దకల్ నుండి గద్వాలకు బస్సులో చేరుకుంది. ఈ విషయాన్ని జడ్చర్లలో ఉన్న భర్త, అత్త కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్ చేయగా కొత్తకోట వద్ద బస్సులో వస్తున్నాం అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటి నుంచి ఫోన్ పని చేయకుండా పోయింది. బాధిత‌ కుటుంబ సభ్యులు శనివారం జడ్చర్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. ఎక్కడ తప్పిపోయారు అక్కడే ఫిర్యాదు చేయాలని జడ్చర్ల పోలీసులు సూచించగా.. వారు గద్వాల పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గద్వాల సీఐ శ్రీను తెలిపారు.

Next Story