- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA Vamsi Krishna : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే నా లక్ష్యం
దిశ, అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే నా ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో అచ్చంపేట ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పని పని చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్ గేట్ వద్ద ఉన్న రామన్పాడు పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ లో భాగంగానే రామన్ పాడ్ పంప్ హౌస్ నుంచి బల్మూరు మండలంలోని గట్టుతుమ్మెన్ గేట్ వద్ద నుండి చెన్నారం, విరాం రామాజిపల్లి, కొండనాగుల గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వంగా ప్రజలకు సుభిక్షమైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు బల్మూరు మండలం లో పురాతన దేవాలయాన్ని సందర్శించి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మోటార్ పనితీరు పరిశీలించారు చిన్నచిన్న సాంకేతిక లోపాలను అందించిన సరిచేసి వారం రోజుల్లో పై గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డి ఈ హేమలత, మిషన్ భగీరథ అధికారి బలరాం, మధుబాబు, బల్మూరు మండల నాయకులు శ్రీపతిరావు, వెంకట్ రెడ్డి, అరుణ నరసింహారావు, గిరి గోవర్ధన్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.