అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు..

by Disha Web Desk 6 |
అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు..
X

దిశ, జడ్చర్ల: మాజీ మంత్రివర్యులు మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా అంగ రంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. శుక్రవారం మధ్య రాత్రి 12 గంటల నుండి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసం వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు బారులు తీరారు. సన్మానాలతో కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే హైదరాబాద్ లోని తన నివాసం వద్ద భార్య శ్వేతా, లక్ష్మారెడ్డి కుమారుడు స్వరూన్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి జడ్చర్లకు పయనమయ్యారు. జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ రాజాపూర్ బాలానగర్ నవాబుపేట ఊరుకొండ మండల కేంద్రాలతో పాటు, గ్రామ గ్రామాన ఎమ్మెల్యే జన్మదిన వేడుకల కేకులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కట్ చేసి ప్రజలకు కార్యకర్తలకు పంచిపెట్టారు.

గొల్లపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ విభాగం ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో భారీ గజమాలతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి స్వాగతం పలికి యూత్ వింగ్ విభాగం ఆధ్వర్యంలో గొల్లపల్లి వద్ద కేక్ కట్ చేయించారు. గొల్లపల్లి నుండి జడ్చర్ల వరకు అశ్వాలతో ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జడ్చర్ల పట్టణంలో విజయనగర్ కాలనీ లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి భారీ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలోని న్యూ బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద క్రేన్ సహాయంతో భారీ గజమాలతో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి పార్టీ శ్రేణులు లక్ష్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలుకుడల్లో అడుగడుగునా భారీ గజమాళలతో స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని పలు కూడళ్లలో అభిమానులు ఏర్పాటు చేసిన వేదికల వద్ద కేక్ కటింగ్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి ఫేస్ మాస్కులు ధరించి కోలాహలం చేశారు. ర్యాలీ బాదేపల్లి మార్కెట్ యార్డ్ వరకు కొనసాగుతుంది. అక్కడ అధికారికంగా కేక్ కటింగ్ అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభం అవుతాయి. జడ్చర్ల పట్టణం భారీ హోల్డింగ్లతో, ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో గులాబీ మయంగా మారిపోయింది. వరుసగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు జడ్చర్ల పట్టణానికి చేరుకోవడంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికి కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్రేజ్ తగ్గలేదని పలువురు చర్చించుకోవడం ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టును ఏపాటిదో తెలియజేస్తుంది.

Next Story