పుట్టిన రోజుకు శాలువాలు, బొకేలు తెస్తే జరిమానా : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 13 |
పుట్టిన రోజుకు శాలువాలు, బొకేలు తెస్తే జరిమానా : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
X

దిశ, భూత్పూర్: ఈనెల 30న నా పుట్టినరోజు సందర్భంగా బొకేలు, శాలువాలు, కేకులు తీసుకు వచ్చే వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా డబ్బులను వృధా చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీ గ్రామాలలో తోచినంత మేర పేద ప్రజలకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు.

నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తే మాత్రం తప్పనిసరిగా విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యపుస్తకాలు, ఇతర సామాగ్రి, మొక్కలు తీసుకురావాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా ఏ ఒక్కరు వ్యవహరించినా వారి నుండి 5 వేల రూపాయల జరిమానా వసూలు చేసి.. వచ్చిన డబ్బులతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, సైకిళ్లు కొనుగోలు చేసి ఇస్తానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.


Next Story

Most Viewed