ధోతి ధరించి కొత్త అవతారమెత్తిన మంత్రి నిరంజన్ రెడ్డి..

by Disha Web Desk 19 |
ధోతి ధరించి కొత్త అవతారమెత్తిన మంత్రి నిరంజన్ రెడ్డి..
X

దిశ, వనపర్తి: రోజు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తల మునకలై ఉండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం పంతులయ్యగా విద్యార్థులకు చదువుతోపాటు.. జీవితంలో రాణించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వివరాలలోకి వెళితే.. గోపాల్పేట మండలం కేజీబీవీ అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన తర్వాత ఆయన ఆయా తరగతులలోకి వెళ్లి సామర్థ్యాలను పరిశీలించారు.

ప్రస్తుతం మనం స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఎందుకు జరుపుకుంటున్నామని విద్యార్థులను ప్రశ్నించడంతో పాటు.. అందుకు సంబంధించిన పదాలను మంత్రి విద్యార్థులచే బోర్డుపై రాయించారు. వీటితో పాటు గణితం, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పలు అంశాలను గురించి మంత్రి విద్యార్థులతో చర్చించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా.. క్రీడలు, ఆధునిక సమాజంలోని పరిస్థితులను గురించి అవగాహన కలిగించాలని సూచించారు. స్వయం మంత్రి గత తరం ఉపాధ్యాయుల మాదిరిగా ధోతి (పంచ), చొక్కా ధరించి తమ సామర్ధ్యాలను పరిశీలించడమే కాకుండా, పాఠ్యాంశాలను గురించి వివరించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed