- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు : శ్రీనివాస్ గౌడ్

దిశ,మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ కోసం మహబూబ్ నగర్ ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తున్నారని, ఆయన ప్రసంగం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన మహబూబ్ నగర్ జిల్లా, రాష్ట్రం ఏర్పడాకా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని, కాంగ్రెస్, బీజెపీలకు తగిన బుద్ధి చెపుతూ, ఏక పక్షంగా కారు గుర్తుకే తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి వెంబడి మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మున్సిపల్ చైర్మన్ కె సి నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.