- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా తహశీల్దారుల బదిలీలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా 25 మంది తహసీల్దార్ల (ఎమ్మార్వోలు) ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా 25 మంది తహసీల్దార్ల (ఎమ్మార్వోలు) ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా లో పని చేస్తున్న రాజీవ్ రెడ్డి నాగర్ కర్నూల్, కే గాయత్రి, హెచ్. రాజగోపాల్, కే కిషోర్ కుమార్, కే దీపిక నారాయణపేట జిల్లాకు బదిలీ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలో పని చేస్తున్న వెంకటేష్ వనపర్తి జిల్లాకు, సుజాతమ్మ , హరేందర్ రెడ్డి, శ్రీను, సుదర్శన్ రెడ్డి మహబూబ్ నగర్ కు, వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న పుచ్చల రవీందర్ తిలక్ కుమార్ రెడ్డి , లక్ష్మీకాంత్ , కే శ్రీనివాస్ జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ కాగా దుబ్బాక పరమేశ నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న వాసుదేవరావు జోగులాంబ గద్వాల జిల్లాకు, జె .బాలరాజ్ మహబూబ్ నగర్ జిల్లాకు, రామకృష్ణ, చింతల రవి, పి పుష్పలత నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. జోగులంబ గద్వాల జిల్లాలో పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి , కరుణాకర్, ఎస్కే నదీమ్ వనపర్తి జిల్లాకు బదిలీ కాగా.. జీవి విమోచన నారాయణపేట జిల్లాకు బదిలీ అయ్యారు.






