- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి నుంచి మద్దిమడుగు అంజన్న బ్రహ్మోత్సవాలు
దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారం గా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 15 తారీకు వరకు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంజనేయ మాలధారణ ధరించిన భక్తులు 41 రోజుల పాటు కటోర మాల దీక్ష చేపట్టి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు బాల విరమణ కార్యక్రమం చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధికంగా హాజరు కానున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం నుండి 52 కిలోమీటర్ల దూరంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది.
స్వామి వారి చరిత్ర..
రాష్ట్రంలో పవిత్ర పుణ్య క్షేత్రాలలో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి. పచ్చదనానికి నిలయమైన నల్లమల కొండలపై ప్రవహించే కృష్ణా నది ఉత్తర వాహినిగా పశ్చిమ భాగాన దుందుభి నది సంభవించు రెండు నదుల కలయిక నడుమ 12 కి. మి దూరంలో ప్రకృతి రమణీయ దృశ్యముల నడుమ వెలసిన ప్రకృతి ఒడిలో సహజంగా ఒదిగిన మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి కృష్ణానది ఒక ఆభరణం లాంటిదే. క్రీస్తు శకం 1120 కాలము నాడు అలనాటి ఆటవికులకు స్వయంభుగా స్వామివారి దర్శనం ఇచ్చి ఉండేనని చర్చించుకుంటారు.
భక్తుల కొంగుబంగారం..
మద్దిమడుగు క్షేత్ర పాదాలను స్పర్శిస్తూ కదిలే కృష్ణమ్మ భక్తుల పాపాలను కడుగుతుందని శోభియ భారంగా కరివిందు చేస్తూ ఉంటుందని వారి నమ్మకం. ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా సేవిస్తే తీరని బాధలు అడ్డు ఉండవని, గాలి, ధూళి లాంటి మానసిక బాధలు,మొండి వ్యాధులను నయం చేసే దేవుడిగా, సంతానార్తులకు సంతానాన్ని ప్రసాదించే ఇలవేల్పుగా మానసిక ఆందోళనలు హరించే స్వామిగా ఇలా కొలిచే భక్తులకు కొంగుబంగారంగా ఆ దేవదేవుడు కొనియాడ పడుతున్నాడు. స్వామివారికి 41 రోజులు నిష్ఠతతో దీక్ష పరీక్షల్లో చేస్తే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకు ప్రతి ఏడాది రెండు పర్యాయాలు భక్తులు శ్రీ హనుమాన్ దీక్షను వేలాదిగా సేకరిస్తూ ఉంటారు.
అత్యంత శక్తిగా కోట మైసమ్మ..
అత్యంత మహిమాన్విత శక్తి క్షేత్రంగా మద్దిమడుగు లో వెలసిన కోట మైసమ్మ అమ్మవారు అగ్రస్థానాన్ని వహిస్తుంది. ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. సహస్ర కోటి లాభాలతో పిలుపు రద్దుకుంటున్న జగన్నాథ పంచేంద్రియాలను నిగ్రహిస్తూ కొజ్జా భూతాత్మకమైన శరీరాన్ని భరిస్తూ ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి జగన్నాథ్ ఈ క్షేత్రం కోట మైసమ్మ అమ్మవారి గా అవతరించింది.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
మద్దిమడుగు ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈనెల 11 నుండి 15 తారీకు వరకు రోజువారీ కార్యక్రమాలు ఇలా జరగనున్నాయి. 11న బుధవారం ఉదయం నిత్యార్చన విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచ గవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం ఉష్ణవాహక సేన 12న విగ్నేశ్వర పూజ, హోమం, రుద్ర హోమం, స్వామివారి సహస్ర నామార్చన, బలిహరణ, నీరాజనం మంత్రపుష్పం, సాయంత్రం చండీ హోమం బలిహరణం తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి అశ్వవాహన సేవ, 13 న విగ్నేశ్వర పూజ, మూలమంత్ర హోమములు, హనుమాన్ వ్రతం సాయంత్రం నిత్యోపసానలు, బలిహరణ, రాత్రికి పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, మంగళ హారతి గజవాహన సేవ, 14న రోజువారీ పూజా కార్యక్రమాలతో పాటు రాత్రికి సీతారాముల కళ్యాణ మహోత్సవం గరుడవాహన సేవ రాత్రి 9:30 నిమిషాలకు హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధతో అత్యంత వైభవంగా నిర్వహించబడును. 15 న పూజలతో పాటు మన్య సూక్తములతో ఆంజనేయ స్వామి వారికి 108 కలశములచే మహా స్నానం నిర్వహించబడును. తదుపరి హనుమాన్ గాయత్రి హోమం మహా పూర్ణహుతి తో బ్రహ్మోత్సవాలు ముగ్గురున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
హనుమాన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్దిమడుగు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు వైద్య సదుపాయాలు ఇతర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని ఆలయ చైర్మన్ రాముల తో పాటు ఈవో రంగాచారి తెలిపారు. ఆలయ వద్ద నిత్య అన్నదానం చేసేందుకు భక్తుల నుంచి విరాళాలు కోరుతున్నామని, భక్తులు ఇచ్చే విరాళాలను బట్టి వారికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి దర్శనం సదుపాయం కల్పించనున్నట్లు వారు వివరించారు.