- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 20న లోక్ అదాలత్
నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి సీనియర్ సివిల్ జడ్జి లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వింధ్య నాయక్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని న్యాయమూర్తి తెలిపారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి సీనియర్ సివిల్ జడ్జి లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వింధ్య నాయక్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని న్యాయమూర్తి తెలిపారు. మే 9న జరగాల్సిన లోక్ అదాలత్ జూన్ 20న జరుగనుంది అన్నారు. తదుపరి నారాయణపేట జిల్లాలోని మొత్తం 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులను గురించి ఆరాధించారు. వాటిని ఈ లోక్ అదాలత్ లో త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు నారాయణపేట టౌన్ రూలర్, మాగనూరు, మద్దూరు, దామరగిద్ద, ఉట్కూర్, కోస్గి, ధన్వాడ, మక్తల్, కృష్ణ, నర్వ, మరికల్, ఎక్సైజ్ ఇతర స్టేషన్ లలో ఈపెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్లో ఉన్నాయని టార్గెట్ గా ఉన్నాయని తెలిపారు.
ఎక్సైజ్ శాఖలో పెండింగ్ కేసులు ఉన్నాయా ..? క్లియర్ చేయాలన్నారు. అన్ని కలిపి 6500 కేసులను టార్గెట్ గా అయన నిర్దేశించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని ఈ లోక్ అదాలత్ ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎజెండా లోని అంశాలు UTPs, చార్జిషీట్, సైబర్ క్రైమ్స్ గురించి చర్చించారు, ముందుగా గౌరవనీయులైన హై కోర్ట్ జుడ్గే ఆదేశానుసారం ముందుగా జైలు లో ఉన్న ఖైదీల కేసులను డిస్పోసల్ చెయ్యాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ చర్చ్ బి మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్ లో పోలీసులందరూ సహకరించి జాతీయ ఉపయోగించుకొని రాజి మార్గం ద్వారా కేసులని తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ DLSA వింధ్య నాయక్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి బి మనోజ్, జూనియర్ సివిల్ జడ్జ్ అవినాష్, డిఫెన్స్ కౌన్సిల్స్ కే. లక్ష్మి పతి గౌడ్, పోలీస్ అధికారులు, కోర్ట్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.






