బాధ్యతగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను పెంచుదాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
బాధ్యతగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను పెంచుదాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా పని చేసి పార్టీ ప్రతిష్టతను పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ న్యూ టౌన్ లోని పార్టీ కార్యాలయంలో 17 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు, వంద ఓటర్ల ఇంచార్జిలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి చిన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూనే ఉంటామని, ఎవరికి ఏ సమస్య వచ్చిన పరిష్కరిస్తానని చెప్పారు.

వార్డు ప్రజల సమస్యలపై వారి పరిధిలో ఉండి కౌన్సిలర్లు, ఇంచార్జీలు దృష్టి సారించాలన్నారు. కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీలో అందరికి సమాన అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి పరుస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed