TUWJ H143 మహాసభను జయప్రదం చేద్దాం: ఆనంద్ కుమార్ గౌడ్

by Disha Web |
TUWJ H143 మహాసభను జయప్రదం చేద్దాం: ఆనంద్ కుమార్ గౌడ్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఈ నెల 11న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో టీయుడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి జిల్లా మహాసభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పేట జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు వారధి నవీన్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘు గణప, నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అవుటి రాజ్ శేఖర్‌లు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ మహా సభలకు ముఖ్య అతిథులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ తదితరులు హాజరవుతారని పేట జిల్లా నుంచి జర్నలిస్టులు ఈ సభలకు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.
Next Story