సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారం సాధిద్దాం

by Disha Web Desk 11 |
సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారం సాధిద్దాం
X

దిశ, కొత్తకోట:సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధిద్దామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు.మంగళవారం కొత్తకోట పట్టణంలోని బీపీఆర్ గార్డెన్ లో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గౌడ ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే బహుజన కులాలను సమీకరించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటను జయించాడని, నేడు అన్నీ అందుబాటులో ఉండి కూడా రాజ్యాధికారం కోసం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నామో ప్రతి బీసీ బిడ్డ ఆలోచించాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు ట్యాక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలలో రెండవ కేడర్ గా ఉండి అగ్రకుల నాయకుల గెలుపుకై కృషి చేయటం మానుకుని, రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, పీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, వెంకటయ్య గౌడ్, రాజశేఖర్ గౌడ్, భగవంతు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story