అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు జోరుగా ఇసుక దందా..

by Disha Web Desk 6 |
అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు జోరుగా ఇసుక దందా..
X

దిశ , కొల్లాపూర్: రామాపురం గ్రామంలో సర్వేనెంబర్ 148 లో ఉన్న స్మశాన వాటికను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లో ఆక్రమణ చేసుకుని ఇసుక అక్రమ రవాణా చేయడంతో పాటు స్మశాన వాటికను పంట పొలాలుగా చేసుకొని వరి పంట వేసుకుంటున్నారు. గ్రామంలో ప్రజలు ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టడానికి కూడా స్మశాన వాటిక లేకుండా ఆక్రమణ చేసుకుంటున్నారు. దీనిపై గ్రామ ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా చూసి చూడనట్టుగా కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తున్నారు. కావున పై అధికారులు స్పందించి స్మశాన వాటిక ఆక్రమణ, ఇసుక అక్రమ దందాకు అడ్డు కట్ట వేయాలని రామాపురం గ్రామ ప్రజలు కోరుచున్నారు. గ్రామంలో ప్రజా ప్రతినిధులు అధికారులు స్మశాన వాటిక ఆక్రమణను అడ్డుకోకుంటే కనక గ్రామంలో రాజకీయాలకతీతంగా, పార్టీలకు అతీతంగా నిరాహార దీక్షలు చేసైనా సరే స్మశాన వాటిక ఆక్రమణను అడ్డుకుంటామని తెలియజేయడం జరుగుతుంది.

స్మశాన వాటిక ఆక్రమణ, ఇసుక అక్రమ దందా ను మీడియా దృష్టికి తీసుకొచ్చిన వారిలో గ్రామ ఎక్స్ సర్పంచ్ తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు, ఎక్స్ ఉప సర్పంచ్ నాగన్న గౌడ్, కొమ్మ రాజు యాదవ్, ఆకునమోని చంద్రయ్య యాదవ్, ఉడుత నాగరాజు ఆకునమోని రామయ్య యాదవ్ రాముడు యాదవ్ ఉడుత గోపాల్ యాదవ్ రాఘవ తదితరులున్నారు.


Next Story

Most Viewed