గద్వాలలో ఘనంగా వజ్రోత్సవాలు

by Dishanational1 |
గద్వాలలో ఘనంగా వజ్రోత్సవాలు
X

దిశ: గద్వాల కలెక్టరేట్: 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫ్రీడం ర్యాలీలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ రంగస్వామి, మున్సిపల్ కమిషనర్ జానకి రాం సాగర్ కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బైక్ లపై జెండాలతో పోలీస్ సిబ్బంది ర్యాలీలో పాల్గొనగా పట్టణంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల నుండి భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలో తేరు మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ సుంకులమ్మమెట్టు, న్యూ బస్ స్టాండ్, కృష్ణవేణి చౌక్, రాజీవ్ మార్గ్ మీదుగా కొనసాగింది. జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు.

వందేమాతరం....భారత్ మాతాకీ జై, జై హింద్ అంటూ నినాదాలు చేసుకుంటూ విజయవంతంగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు పోరాడితే మనకు స్వతంత్రం వచ్చిందని, తద్వారా మనం ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అందుకు మనం వారిని స్మరిస్తూ 75 సం" ల స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, మనమందరం వారి చూపిన దారిలో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు.

నేటి బాలలే రేపటి సిటిజన్స్ విద్యార్థులు అందరూ బాగా చదువుకొని దేశాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలని అన్నారు. ప్రతి విద్యార్థికి ఒక డ్రీమ్ ఉండాలని, అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరి దేశానికి పేరు తేవాలని అన్నారు. ఈ రోజు నిర్వహించిన ఫ్రీడం ర్యాలీకి పట్టణంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులు సమర యోధుల వేషధారణలో వచ్చి జాతియ జెండాలను చేతపట్టి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొని విజయ వంతం చేసినందుకు పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నవశకం వైపు భారతదేశాన్ని నడిపించడంలో విద్యార్థుల యువతను ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డిఎస్పీ ఇమ్మానియోల్, డి. ఈఓ సిరాజుద్దీన్, ఇంటర్మీడియట్ విద్యాధికారి సుందర్ రాజు, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed