కోసిగిలో బీఆర్ఎస్ సంబరాల జోరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

by Disha Web |
కోసిగిలో బీఆర్ఎస్ సంబరాల జోరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
X

దిశ, కోసిగి: కోసిగి పట్టణ కేంద్రంలో శివాజీ చౌరస్తా ప్రధాన కూడలి వద్ద బుధవారం టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. బాణాసంచాలతో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. భారతదేశ దిశను మార్చేందుకు కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. మంత్రి కేటీఆర్ కోసిగి సభలలో ఇచ్చిన హామీ మేరకు విజయదశమిని రోజున రూ. 3.50 కోట్లు నిధుల మంజూరు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారు.

ఇలాంటి నిధులతో దండం చెరువు కట్టను మినీ ట్యాంకుబండ్‌గా నిర్వహించేందుకు, కోసిగి బస్ బస్టాండ్‌లను మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో త్వరితగతిన పూర్తి చేస్తామని కోసిగి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, జడ్పిటీసీ ప్రకాశ్ రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, సహకార సంఘం చైర్మన్ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, నాయకులు హరి, వెంకట్ నరసింహులు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed