నిధులు ఇస్తా మక్తల్‌కి వస్తా.. కేటీఆర్ హామీ

by Disha Web |
నిధులు ఇస్తా మక్తల్‌కి వస్తా.. కేటీఆర్ హామీ
X

దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన తర్వాత.. పనులను ప్రారంభించేందుకు మక్తల్‌కు వస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మంత్రి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌ను, హోంమంత్రి మహ్మద్ అలీని కలవడం జరిగింది. మక్తల్‌కు మంజూరైన ఫైర్ స్టేషన్‌కు, నియోజకవర్గంలోని కృష్ణ అమరచింత మండల కార్యాలయాల కాంప్లెక్స్‌లకు భూ సేకరణ జరిగిందని.. వాటికి నిధులు మంజూరు కావాల్సి ఉందని ఆయన తెలిపారు.

దాంతోపాటు ఉట్కూర్ మక్తల్ కృష్ణ మండల కేంద్రాల్లో కస్తూరిబా గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా పాలనాపరంగా మంజూరైన పక్కా భవనాల నిర్మాణం కోసం నిధుల కేటాయింపు జరగాల్సి ఉందని వాటిని త్వరగా క్లియరెన్స్ చేసే టెండర్లు కాల్ ఫర్ చేయడానికి వీలు ఉంటుందని వారితో ప్రస్తావించినట్టు సమాచారం. రైతుల పక్షపాతైన కేసీఆర్ ప్రభుత్వం కావడంతో మక్తల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయని వాటిని పూర్తి చేయడానికి నిధులు మంజూరు కావాల్సి ఉందని దీనిని పరిశీలించాలని కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో ఫైనాన్స్ పరంగా మంజూరితో మక్తల్ నియోజకవర్గానకి పర్యటనకు వస్తానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, చిట్టెం రామ్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా సమాచారం.


Next Story