ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..

by Disha Web Desk 13 |
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..
X

దిశ, ప్రతినిధి, నాగర్ కర్నూల్: విరాసత్ పట్టా చేసేందుకు 10 వేల లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం డీప్యూటీ తహసీల్దార్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. కోడేరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతు వారి తాత వెంకయ్య పేర రేకులపల్లి శివారులో 1:12 గుంటల భూమి ఉన్నది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

రైతు పొలాన్ని విరాసత్ పట్టా చేసేందుకు 10 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడేరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతు వారి తాత వెంకయ్య పేర రేకులపల్లి శివారులో 1:12 గుంటల భూమి ఉన్నది. దానిని వారి చిన్నాన్న నాగయ్య పేర విరాసత్ కోసం గత ఏడాది జూన్ 16న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పుడు అప్పుడు అంటూ డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం కాలం వెల్లదిస్తూన్నాడు.

దీంతో డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం రైతు నుండి 15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో పది వేలకు బేరం కుదిర్చి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారుల బృందం సోమవారం కోడేరు తహసీల్దార్ కార్యాలయంలో వల పన్ని రైతు నుంచి డబ్బులు తీసుకున్నతహసీల్దార్ పురుషోత్తం ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.


Next Story

Most Viewed