సీఎం రేవంత్ రెడ్డిని తన పాటతో అలరించిన కిన్నెర మొగులయ్య

by Disha Web Desk 23 |
సీఎం రేవంత్ రెడ్డిని తన పాటతో అలరించిన కిన్నెర మొగులయ్య
X

దిశ,లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలి కుంట గ్రామానికి చెందిన జానపద కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య. ఈయన బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కిన్నెర వాయిస్తూ సీఎంపై పాటతో అలరించారు. 'పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండారెడ్డిపల్లిలోన' అంటూ పాట పాడారు. మొగులయ్య పాటకు మంత్ర ముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయనను అభినందించారు. కాగా 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో మొగులయ్య ఆఖరి తరం కళాకారుడు. 2022 లో ఆయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పరిస్థితిని సీఎంకు వివరించారు. అనంతరం తన చిన్న కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో ఫోటో దిగారు.


Next Story

Most Viewed