- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే : రాజేందర్ రెడ్డి

దిశ, నారాయణపేట ప్రతినిధి: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కోయిలకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వివరాలను ఎమ్మెల్యే ఓటర్లకు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు చనిపోతే దిక్కుతోచని బాదిత కుటుంబానికి రూ.5 లక్షలు అందించి ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం కుస్తీ లు పడే పరిస్థితి ఉండేదని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి పెట్టుబడి కింద నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాగ ధన్వాడ మండలంలోని ఎంనోన్ పల్లి, గున్ముక్ల గ్రామాలకు చెందిన కు చెందిన పలువురు వార్డు మెంబర్లు 80 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కి చేరారు. అలాగే కోటకొండ గ్రామానికి చెందిన పలువురు కమ్యూనిస్టులు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.