- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
బడ్జెట్లో నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఊసే లేదు..

దిశ, తెలకపల్లి: ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు మరోసారి నిరాశకు గురి చేసిందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ దుయ్యబట్టారు. 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 2018 ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన సభలో రైతులకు 1 లక్ష రూపాయల రుణ మాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించ్చారు. ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో 1 లక్ష రూపాయల ఋణ మాఫీకి నిబంధనలు రూపొందించలేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాక నిరుద్యోగులకు 3016/-లు ఇస్తామని చెప్పిన హామీ, అసలు కేసీఆర్‌కు గుర్తుందా అని నిలదీశారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆరోపించారు.
ఇంటి స్థలం ఉన్న పేదలకు 5 నుంచి 6 లక్షలు ఇస్తామని, ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కి బడ్జెట్లో 3 లక్షలు ప్రవేశ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇక, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ అటకకు ఎక్కించిందని అన్నారు. ఈ ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో కూడా పేదలకు అన్యాయమే జరిగిందని వ్యాఖ్యనించారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో గిరిజనులకు కూడా మోసం చేసిందని దుయ్యాబట్టారు. మొత్తంగా నిరుద్యోగులను, గిరిజనులను, రైతులను, పేదలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీదేనని, రానున్న ఎన్నికల్లో బొంద తీసి పాతీ పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకు ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్, తెల్కపల్లి మండల అధ్యక్షులు ఆర్.శివ శంకర్, తెల్కపల్లి మండల నాయకులు బాల నాగులు, సుల్తాన్, సామ చెన్నయ్య, మొగులాల్ తదితరులు పాల్గొన్నారు.