Collector : అక్షర పోరాట యోధుడు కాళోజీ

by Kalyani |
Collector : అక్షర పోరాట యోధుడు కాళోజీ
X

దిశ,వనపర్తి : తెలంగాణ అస్తిత్వం కాపాడడం కోసం అహర్నిశలు పరితపించిన అక్షర పోరాటం యోధుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవితంను స్ఫూర్తిగా తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు 110 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కాళోజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… కాళోజీ నారాయణ రావు ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతాం అన్నారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు సంచిత్ గంగ్వార్, నగేష్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు నివాళులు అర్పించారు.

Advertisement

Next Story