- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసలు సిసలైన ప్రతి జర్నలిస్ట్‌కు న్యాయం చేస్తా : వనపర్తి ఎమ్మెల్యే

దిశ,వనపర్తి : వర్కింగ్ జర్నలిస్టులు అపోహలపెట్టుకోవద్దని,రాజకీయాలకు అతీతంగా అసలు సిసలైన ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేస్తాననీ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా ఇచ్చారు.శనివారం రాత్రి వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల ప్లాట్ల సమస్యపై ఎమ్మెల్యే మెగా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సంవత్సర కాలంగా నెలకొన్న గందరగోళానికి తానే త్వరలోనే ముగింపు పలుకుతామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు.జర్నలిస్టుల ప్లాట్ల రాళ్ల తొలగింపు వివాదం తో ఎలాంటి సంబంధం లేదన్నారు.
జర్నలిస్టుల పట్ల తాను మొదటి నుంచి సానుకూలంగా ఉన్నానని, ఎంతో మంది జర్నలిస్టులకు తాను సాయపడ్డానని మెగా రెడ్డి గుర్తు చేశారు. మరో మూడు నాలుగు రోజుల్లోనే ఈ సమస్యకు ముగింపు పలుకుదామని,తానే వచ్చి జర్నలిస్టుల ప్లాట్ల వద్ద టెంకాయలు కొట్టి ఇంటి నిర్మాణాలను ప్రారంభిస్తారని అన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపట్టాలలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్ది జర్నలిస్టులకు మునుముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఇక మీదట తానే జర్నలిస్టులకు కేర్ టేకర్ గా ఉంటాన్నన్నారు.జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.