దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు

by Disha Web Desk 12 |
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు
X

దిశ, అలంపూర్ : తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తి పీఠం. దేశంలోనే అయిదో శక్తి పీఠం అయిన జోగులాంబ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 26 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూర్ క్షేత్రం లో సోమవారం నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తర వాహిని తుంగభద్ర నది తీరాన వెలసిన 5వ శక్తి పీఠం శ్రీ జోగులాంబ అమ్మవారు దేశంలోనే అత్యంత విశిష్టత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. ఈ క్షేత్రములో దేశంలో మరెక్కడా లేనటువంటి నవ బ్రహ్మేశ్వరాలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ క్షేత్రానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు.. రెండో పులకేశి ఈ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారని ఆలయాల చరిత్రకారులు పేర్కొన్నారు.

ఇంత పురాతనమైన ఈ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వచ్చే భక్తులకు సౌకర్యాలు నిమిత్తం క్యూ లైన్లు, మహిళా భక్తులకు వాష్ రూమ్స్, మంచి నీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, 24 గంటల వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని.. పోలీసుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని పురేందర్ ఆలయ ఈఓ- ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26 సోమవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ బుధవారం వరకు ఉత్సవ మూర్తి అమ్మవారికి నిత్య అలంకరణ ఉంటుందని వెల్లడించారు. అన్ని ఆలయాల్లో పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.. అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, ఆ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయన్నారు.


Next Story

Most Viewed