ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కలెక్టర్ రవి నాయక్

by Sumithra |
ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కలెక్టర్ రవి నాయక్
X

దిశ, మహబూబ్ నగర్ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిట్రసి, ఎంటీఎస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ తెలిపారు. స్పెషలిస్ట్ ఇన్ ఫైనల్ లిటరసీ లో 1 పోస్టు, ఎంటీఎస్ లో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఎకనామిక్స్/బ్యాంకింగ్ అర్హత కలిగి ఉండాలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని కలెక్టర్ తెలిపారు. 2022 జులై 1 నాటికి 21 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని (జీఓఎంఎస్ నెం.42 ప్రకారం 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది) ఆయన తెలిపారు.

అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలని, ఈ పోస్ట్ పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినందున ప్రిసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం ఈ పోస్టులకు‌ జిల్లా వాసులు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. ఎంటీఎస్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు ఉన్న బోర్డు నుండి పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, పై రెండు పోస్టులకు ఈ నెల 11 నుండి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామన్నారు. దరఖాస్తుతో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో గజిటెడ్ అధికారిచే ధృవీకరించి జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా, రూమ్ నెంబర్ 36, సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటల లోగా సమర్పించాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను http://mahabubnagar.telangana.gov.in/recruitments / http://mbnrgov.in/dhew

ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి భర్తీ రద్దు చేసేందుకు, మార్చేందుకు పూర్తి అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని, చివరి తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed