మే 6 న మంత్రి కేటీఆర్ చే దివిటిపల్లిలో ఐటీ టవర్ ప్రారంభం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
మే 6 న మంత్రి కేటీఆర్ చే దివిటిపల్లిలో ఐటీ టవర్ ప్రారంభం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఐటీ టవర్' ను మే 6వ తేదీన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో టీఎస్ఐఐసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిగా నిలిచి, వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు దారులు వేస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.

బెంగుళూర్ హైవేపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పెద్ధ ముఖ ద్వారం నిర్మిస్తూ, అక్కడి నుంచి ఐటీ టవర్ వరకు 100 ఫీట్ల నూతన కనెక్టింగ్ రోడ్డు వేయాలని ఆయన టీఎస్ఐఐసీ అధికారులకు, అలాగే ఐటీ టవర్ నుంచి మహబూబ్ నగర్ పట్టణానికి రోడ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ప్రారంభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, పనులు గురువారం నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, కన్సల్టెంట్ రాజ్ కుమార్, గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్ రెడ్డి, అమర్ రాజా సంస్థ ప్రతినిధులు మసూద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed