సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే పేటకు సైనిక్ స్కూల్ తీసుకొస్తా : డీకే అరుణ

by Aamani |
సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే పేటకు సైనిక్ స్కూల్ తీసుకొస్తా : డీకే అరుణ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం తరఫున సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే పేటకు సైనిక్ స్కూల్ తీసుకొస్తానని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని 6వ వార్డులో TFUIDC & మున్సిపల్ ఫండ్స్ రూ.220 లక్షలతో ఏర్పాటు చేసిన పార్క్ ను ఎంపీ డీకే అరుణ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అలాగే అమృత్ స్కీమ్ కింద వాటర్ సప్లై పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమృత్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ లకు నిధులు ఇస్తున్నామన్నారు. అందరికీ మంచినీళ్లు అందించాలన్న సదుద్దేశంతో నిధులు ఇచ్చామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణపేట కు కూడా నవోదయ మంజూరు చేయించాలని ఎంపీ డీకే అరుణను ఎమ్మెల్యే పర్నికా రెడ్డి కోరారు. రాబోయే రోజుల్లో నారాయణపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, కమిషనర్ సునీత, మునిసిపల్ చైర్ పర్సన్ అనసూయ, కౌన్సిలర్లు మహేష్, సత్య రఘుపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల భాగంగా జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డి వైఎస్ఓ వెంకటేష్, డీపీవో కృష్ణ, హెచ్ ఎం భారతి, మండల విద్యాధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే దామరగిద్ద మండలానికి మంజూరైన 108 వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed