బీఆర్ఎస్ vs బీజేపీ.. ఈదమ్మ తల్లి జాతరలో ఉద్రిక్తత

by Disha Web |
బీఆర్ఎస్ vs బీజేపీ.. ఈదమ్మ తల్లి జాతరలో ఉద్రిక్తత
X

దిశ, కొల్లాపూర్: పానగల్ మండల కేంద్రంలో కన్నుల పండుగగా ఈదమ్మ తల్లి జాతర మంగళవారం సాయంత్రం జరిగింది. జాతరలో ప్రధాన ఘట్టం షిడే మహోత్సవం భక్తుల ఈదమ్మ తల్లి నామస్మరణలతో ముందుకు సాగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈదమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిడే కు చివరిలో మేక పిల్లను కట్టి గుడి చుట్టూ తిప్పుతూ.. భక్తులకు దర్శనం ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు.

ఈదమ్మ జాతరలో షిడే ముందు బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గొడవ జరిగింది. జాతరలో ఇరు వర్గాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో తీవ్ర ఉధృతంగా చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరువర్గాల నాయకులను చెదరగొట్టారు. పోలీసులు రెండు పార్టీల నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో చెదరగొట్టారు. దీంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పార్టీల గొడవ మధ్య షిడే మహోత్సవం జరిగింది. భక్తులు షిడే మహోత్సవాన్ని చూడడానికి పోటెత్తారు.Next Story

Most Viewed