అచ్చంపేట వస్తా.. ఏర్పాట్లు చేస్కో.. ఎమ్మెల్యేతో సీఎం కేసీఆర్ ఫోన్ కాల్

by Disha Web Desk 4 |
అచ్చంపేట వస్తా.. ఏర్పాట్లు చేస్కో..  ఎమ్మెల్యేతో సీఎం కేసీఆర్ ఫోన్ కాల్
X

దిశ, అచ్చంపేట: వచ్చే నెలలో తప్పకుండా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటిస్తా .. మీ నియోజకవర్గానికి సాగునీరు అందించే ఉమామహేశ్వర, లక్ష్మీ చెన్నకేశవ పథకానికి శంకుస్థాపన చేసి నీళ్లిచ్చే బాధ్యత నేనే తీసుకుంటా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మరోసారి హామీ ఇచ్చారు. అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో బల్మూరు మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో గురువారం రాత్రి పొద్దు పోయే వరకు విప్ గువ్వల బాలరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు బల్మూరు మండలానికి సాగునీరందించే ఉమామహేశ్వర రిజర్వాయర్ పనులు ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉన్నదని పలువురు నేతలు, విప్ గువ్వల బాలరాజును అడిగారు.

సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన విప్

సాగునీటి విషయంపై ప్రాజెక్టు నిర్మాణం కోసం నాయకులు అడగడంతో వెంటనే సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు విప్ గువ్వల తెలిపారు. చరవాణి ద్వారా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 'బాలరాజు నువ్వు కోరినట్లు అన్ని పనులు పూర్తి చేయించే బాధ్యత నాద అని సీఎం చెప్పారని, వచ్చే నెల తప్పకుండా అచ్చంపేటకు, చారకొండకు వస్తా .. హెలికాప్టర్ అడవిలో దింపుతావో , ఎక్కడ దింపుతావో ఏర్పాట్లు చేసుకో అన్నారన్నారు.

'అచ్చంపేట నియోజకవర్గంపై నాకు బాగా అవగాహన ఉన్నది. నియోజకవర్గంలో బాగా పనిచేస్తున్నావు .. నీకు తిరుగులేదు .. నీకు ఏమి చేయాలో నేను చేస్తాను .. నీ నాయకత్వాన్ని మరింత బలపర్చే బాధ్యత నాదే' అని కేసీఆర్ అన్నారని వివరించారు. ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్ పనులు చేద్దామని చెప్పారని ఆయన తెలిపారు. సీఎం సార్ మీరు జాతీయ రాజకీయాల్లో వెళ్లాల్సిన అవసరం ఉన్నదని తాను సూచించినట్లు విప్ గువ్వల తెలిపారు. ఇందుకుగానూ కేసీఆర్ మాట్లాడుతూ.. 'ఖచ్చితంగా మనం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం .. భగవంతుడు దీవెనలతో అన్నీ ఆయనే చూసుకుంటాడని చెప్పారని వివరించారు.



Next Story

Most Viewed