- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జీతం రాలేదని గ్రామ పంచాయతీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
దిశ, నాగర్ కర్నూల్/బిజినపల్లి: గ్రామ పంచాయతీ కార్మికుడికి జీతం ఇవ్వలేదని మనస్తాపం చెంది కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన సూరంపల్లి బాలపీరు (55) అదే గ్రామ పంచాయితీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాటిస్తున్నాడు. గత ఏడు నెలల జీతం పెండింగ్లో ఉండటంతో రెండు నెలల కింద పని మానేశాడు. అనంతరం చేసిన పని దినాలకు సంబంధించి జీతం ఇవ్వాలని రోజు తిరుగుతున్న పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని మనస్తాపం చెంది సోమవారం కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం పై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. జీతం చెక్కు మంజూరు చేయడం జరిగిందని ఎస్ టి ఓ కార్యాలయంలో పెండింగ్ ఉంది. కేవలం రెండు రోజులు మాత్రమే ఆగమని చెప్పామన్నారు. అయినా అతను వినకుండా ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి జిల్లా ఆసుపత్రికి చేరుకొని బాలపీరు ను పరామర్శించారు.