పందులకు నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రి..

by Disha Web Desk 11 |
పందులకు నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రి..
X

దిశ, వీపనగండ్ల: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పే ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్న పట్టించుకోకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు పరిసరాల పరిశుభ్రత అంటే ఇదేనా అంటూ అవాక్కవుతున్నారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిరంతరం పందులు సంచరిస్తున్నా, సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ పందులు ఆసుపత్రి ఆవరణలోకి రాకుండా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ ఉన్నా పలుచోట్ల కొందరు గోడలను ధ్వంసం చేయడం, ప్రధాన గేట్ ద్వారం సరిగా లేకపోవడంతో పందులు, కుక్కలు, పశువులు ఆసుపత్రి ఆవరణలో సంచరిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed